శనివారం 30 మే 2020
National - Mar 28, 2020 , 12:05:40

క‌రోనా ఎఫెక్ట్‌: ది ప్రింట్, టైమ్స్ గ్రూప్ మ‌ధ్య లీగ‌ల్ ఫైట్‌

క‌రోనా ఎఫెక్ట్‌: ది ప్రింట్, టైమ్స్ గ్రూప్ మ‌ధ్య లీగ‌ల్ ఫైట్‌

న్యూఢిల్లీ: న‌్యూస్ ప్రింట్ ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తుంద‌న్న వార్త రెండు ప్ర‌ధాన‌ మీడియా సంస్థల మ‌ధ్య లీగ‌ల్ ఫైట్‌కు దారితీసింది. ప్ర‌ముఖ డిజిట‌ల్ మీడియా సంస్థ ది ప్రింట్ న్యూస్ ప్రింట్ ద్వారా క‌రెన్సీ నోట్ల ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాప్తిచెందుతుందంటూ  మార్చి 23న ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అయితే ఈ క‌థ‌నాన్ని దేశంలోనే అతిపెద్ద మీడియా దిగ్గ‌జం అయిన టైమ్స్ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. ది ప్రింట్ త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చారం చేసిందంటూ లీగ‌ల్ నోటీస్ పంపించింది. 

ది ప్రింట్ వెబ్‌సైట్ త‌న క‌థ‌నం ద్వారా ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టించింద‌ని టైమ్స్ గ్రూప్ ఆరోపిస్తున్న‌ది. ఆ త‌ప్పుడు క‌థ‌న‌కంవ‌ల్ల‌ న్యూస్ పేప‌ర్లు తీసుకోవ‌డానికి పాఠ‌కులు నిరాక‌రిస్తున్నార‌ని, ముంబైలోని కొన్ని హౌసింగ్ సొసైటీలు పేప‌ర్ బాయ్‌ల‌పై నిషేధం విధించాయ‌ని పేర్కొంది. పేప‌ర్ పై కొవిడ్‌-19 కొంత‌కాలం పాటు ఉంటుంద‌నే విష‌యం శాస్త్రీయంగా నిజ‌మే అయినా, న్యూస్ పేప‌ర్ ద్వారా వైర‌స్ వ్యాప్తి చెంద‌టం అత్యంత అరుదైన విష‌యమ‌ని టైమ్స్ గ్రూప్ పేర్కొన్న‌ది. 

ది ప్రింట్ త‌న‌ త‌ప్పుడు క‌థ‌నాన్ని తొల‌గించ‌క‌పోతే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని టైమ్స్ గ్రూప్ హెచ్చిరించింది. ఆర్థికంగా ల‌బ్ధిపొందాల‌న్న ఉద్దేశంతోనే ది ప్రింట్ ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌తీసిందని ఆరోపించింది. అయితే టైమ్స్ గ్రూప్ ఆరోప‌ణ‌ల‌ను ది ప్రింట్ కొట్టిపారేసింది. కాగితం ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు, ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయ‌ని, త‌మ క‌థ‌నంలో ఎలాంటి త‌ప్పుడు ప్ర‌చారం లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నది. ఈ విష‌యంలో టైమ్స్ గ్రూప్‌తో లీగ‌ల్ ఫైట్‌కు తాము సిద్ధ‌మేన‌ని తెగేసి చెప్పింది.  


logo