ఆదివారం 29 మార్చి 2020
National - Mar 09, 2020 , 10:28:51

కరోనా ఎఫెక్ట్‌.. విమాన రాకపోకలు బంద్‌

కరోనా ఎఫెక్ట్‌.. విమాన రాకపోకలు బంద్‌

తమిళనాడు: కోవిద్‌-19(కరోనా వైరస్‌) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా బిజెనెస్‌ భారీగా దెబ్బతిన్నది. ఇప్పటివరకు, ప్రపంవ్యాప్తంగా కోవిద్‌-19 కారణంగా 3 వేలకు పైగా వ్యక్తులు మృత్యువాత పడగా, లక్షకు పైగా వ్యక్తులు వ్యాధి లక్షణాలతో వివిధ దేశాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇవాళ చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు బయల్దేరే 10 విమానాలను అధికారులు రద్దు చేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలోనే విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో దేశంలో విదేశీ విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. 


logo