శనివారం 04 జూలై 2020
National - Jun 30, 2020 , 08:22:41

ఎక్స్‌రే సాయంతో కరోనా నిర్ధారణ

ఎక్స్‌రే సాయంతో కరోనా నిర్ధారణ

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచం మొత్తం పరిశోధనలు చేస్తోంది. కొవిడ్‌ పరీక్షలకే ఎక్కువ సమయం పడుతుండడంతో ఐఐటీ గాంధీనగర్‌ విద్యార్థులు కొత్తగా ఆలోచన చేశారు. ఛాతీకి సంబంధించిన ఎక్స్‌రే తీసి, దానిని కంప్యూటర్‌ ఆధారంగా పరిశీలిస్తే కొవిడ్‌ నియంత్రణకు అవకాశం ఉంటుందని, అందుకు తగ్గటుగా కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ను కూడా రూపొందించారు. ‘డీప్‌ లెర్నింగ్‌ టూల్‌’ అనే పేరుతో ఓ యంత్రాన్ని కూడా వారు రూపొందించారు.

ఎక్స్‌రేను ఈ యంత్రానికి లింక్‌ చేస్తే కొవిడ్‌ ఫలితాలను తెలియజేస్తుందని పరిశోధన టీం సభ్యుడు ఎంటెక్‌ విద్యార్థి కుష్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ తెలిపారు. మెదడులోని నాడి వ్యవస్థ ఆధారంగా దీనిని తయారు చేశారు. దీనిపై అవగాన కల్పించి అందరికీ అందుబాటులోకి తేవచ్చని విద్యార్థులు చెబుతున్నారు.


logo