గురువారం 04 జూన్ 2020
National - May 21, 2020 , 15:16:02

రాజస్థాన్‌లో 150కి చేరిన కరోనా మరణాలు

రాజస్థాన్‌లో 150కి చేరిన కరోనా మరణాలు

జైపూర్‌: రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తగా 131 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,146కు చేరింది. ఇక మరణాలు కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 150కి చేరింది. కాగా, మొత్తం కేసులలో ఇప్పటి వరకు 3,422 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక జిల్లాల వారీగా చూస్తే జైపూర్‌లో అత్యధికంగా 1675 కేసులు నమోదయ్యాయి. 1131 స్థానాలతో జోధ్‌పూర్‌ ఆ తర్వాత స్థానంలో ఉంది.


logo