శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 16:58:54

దేశంలో 10కి చేరిన క‌రోనా మ‌ర‌ణాలు!

దేశంలో 10కి చేరిన క‌రోనా మ‌ర‌ణాలు!

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూ ఉంది. క‌రోనా మ‌ర‌ణాలు సైతం చాప కింద నీరులా ఒక్కొక్క‌టిగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర‌లో మ‌రో వ్య‌క్తి క‌రోనా కాటుకు బ‌లికావ‌డంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాలు సంఖ్య 10కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య సైతం 492కు చేర‌కుంది. 

ఇక‌, క‌రోనా మ‌ర‌ణాలైనా, పాజిటివ్ కేసులైనా మ‌హారాష్ట్ర‌లోనే ఎక్కువ‌గా చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 492 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. మ‌హారాష్ట్ర‌లో ఆ సంఖ్య 106గా ఉంది. మొత్తం 10 మ‌ర‌ణాల్లో కూడా మ‌హారాష్ట్ర‌లోనే ముగ్గ‌రు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ, ప‌శ్చిమ‌బెంగాల్‌, బీహార్‌, పంజాబ్‌, క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌ల‌లో ఒక్కొక్క‌రు చొప్పున మృతిచెందారు. కాగా, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారినప‌డి విముక్తి చెందిన వారు 37 మంది ఉన్నారు.   

 


logo