బుధవారం 08 జూలై 2020
National - Jun 14, 2020 , 19:50:41

కరోనాకు త్వరలో టీకా.! : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

కరోనాకు త్వరలో టీకా.! : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ :  దేశంలో కరోనా సంక్షోభం ఇంకా ఎంతోకాలం కొనసాగదని, త్వరలో టీకా అందుబాటులో రానుందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుజరాత్‌ జన్‌ సంవాద్‌ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. త్వరలో కరోనా సంక్షోభాన్ని అధిగమిస్తామని, దేశంలోని శాస్త్రవేత్తలు టీకాను అభివృద్ధి చేసేందుకు పగలూరేయి శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. టీకా త్వరలోనే అందుబాటులోకి రానుందని తనకు నమ్మకం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 24గంటల వ్యవధిలో అత్యధికంగా 11,929 కరోనా కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు దీని బారినపడిన వారి సంఖ్య 3,20,922కు చేరిందని, 9,195మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంరక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.  


logo