శుక్రవారం 03 జూలై 2020
National - May 02, 2020 , 15:44:03

సొంతూరు చేరిన ఏడుగురికి క‌రోనా

సొంతూరు చేరిన ఏడుగురికి క‌రోనా

కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో దేశంలోని వ‌ల‌స కూలీలు వారి స్వంత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది వ‌ల‌స కూలీలు త‌మ‌త‌మ ప్రాంతాల‌కు చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారిని అక్క‌డ 14రోజుల క్వారంటైన్ త‌ర్వాత ఇళ్ల‌లోకి చేరుతున్నారు. ఇదే స‌మ‌యంలో యూపీకి చేరిన ఎడుగురు కూలీల‌కు క‌రోనా రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇటీవల మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు కొందరు కూలీలు చేరుకున్నారు. క్వారంటైన్‌లో ఉంచి.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి పాజిటివ్  నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. యూపీలోని బస్తి జిల్లాకు కొందరు వారి ఊరికి చేరుకోగా  ఓ కాలేజీలో క్వారంటైన్‌లో ఉంచారు. వారికి కోవిడ్ నిర్ధారణ కావడంతో స్థానిక కరోనా ఆసుపత్రికి తరలించారు. ఆ ఏడుగురిని ఇటీవల కలిసిన వారిని కూడా ట్రేస్ చేసిన అధికారులు వారిని కూడా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు.


logo