ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 12:03:07

ఆంధ్రప్రదేశ్‌లో 2200కు చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో 2200కు చేరిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2205కు చేరుకోగా, మృతుల సంఖ్య 49కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 803 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,353 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 90 శాతం తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌తో సంబంధం కలిగినవే కావడం విశేషం.

గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 9 కేసుల చొప్పున ఉన్నాయి. వీటితోపాటు చిత్తూరులో 8, కృష్ణా జిల్లాలో 7, విశాఖపట్నంలో 4, కడప, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మొత్తం 9628 మంది పరీక్షలు నిర్వహించగా, 48 మంది పాజిటివ్‌ వచ్చింది. కర్నూలుకు చెందిన కరోనా బాధితుడు ఈ రోజు మరణించాడు. 

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 608 కేసులు నమోదవగా, గుంటూరులో 413, కృష్ణాలో 367, చిత్తూరులో 173, నెల్లూరు 149, అనంతపురంలో 122, పశ్చిమగోదావరిలో 70, విశాఖపట్నంలో 72, తూర్పుగోదావరిలో 52, ప్రకాశంలో 63, శ్రీకాకుళం, విజయనగరంలో 7 చొప్పున కేసులు నమోదయ్యాయి.


logo