సోమవారం 13 జూలై 2020
National - Apr 14, 2020 , 21:31:33

యూపీలో 660కి చేరిన‌ క‌రోనా కేసులు

యూపీలో 660కి చేరిన‌ క‌రోనా కేసులు

యూపీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు యూపీలో 660 క‌రోనా పాజిటివ్ కేసులు  న‌మోదైన‌ట్లు యూపీ ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అమిత్ మోహన్ ప్ర‌సాద్ వెల్ల‌డించారు. అమిత్ మోహన్ ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ..మొత్తం కేసుల్లో 49 మంది పూర్తిగా కోలుకుని..ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యార‌ని, 8 మంది చ‌నిపోయార‌ని తెలిపారు. రాష్ట్రంలో 41 జిల్లాల్లో క‌రోనా వైరస్ ప్ర‌భావం ఉంద‌ని తెలిపారు.

మ‌రోవైపు ప్ర‌జలంతా లాక్ డౌన్ పాటించేలా అధికారులు, పోలీసులు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు ప్ర‌భుత్వం రాష్ట్రంలో హాట్ స్పాట్ల‌ను గుర్తించి..ఆయా ప్రాంతాల్లో రాక‌పోక‌ల‌ను నిషేధించి..ఇంటి వ‌ద్ద‌కే స‌రుకులు పంపిణీ చేస్తోంది.ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo