మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 11:28:35

మ‌హారాష్ట్ర‌లో 124కు క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో 124కు క‌రోనా కేసులు

ముంబై: క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మ‌హారాష్ట్రలో క‌రోనా మ‌రింత వేగంగా విస్త‌రిస్తున్న‌ది.  గురువారం ఉద‌యం కొత్త‌గా న‌మోదైన రెండు కేసుల‌తో క‌లిపి మ‌హారాష్ట్ర‌లో మొత్తం కేసుల సంఖ్య 124కు చేరింద‌ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కొత్త‌గా క‌రోనా పాజిటివ్‌గా తేలిన ఇద్ద‌రిలో ఒక‌రు థానేకు చెందిన‌వారు కాగా, మ‌రొక‌రు ముంబై వాసి అని తెలిపింది. 

కాగా, మ‌హారాష్ట్ర‌లో ముందుగా మార్చి 31 వ‌ర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే ఆ త‌ర్వాత కేంద్ర స‌ర్కారు 21 రోజుల లాక్‌డౌన్ విధించ‌డంతో.. ఏప్రిల్ 14 వ‌ర‌కు జ‌నం ఇండ్ల‌కే ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ఈ లాక్‌డౌన్ నుంచి అత్యావ‌స‌రాలైన ఆహార సంబంధ ప‌దార్థాలు, కూర‌గాయ‌లు, పండ్లు, వంట స‌రుకులు, బేక‌రీ ఐట‌మ్స్‌, మెడిక‌ల్ షాపుల‌కు మిన‌హాయింపులు ఇచ్చిన‌ట్లు మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.   


logo