శుక్రవారం 03 జూలై 2020
National - Jun 27, 2020 , 18:30:23

త‌మిళ‌నాడులో కొన‌సాగుతున్న క‌రోనా విస్తృతి

త‌మిళ‌నాడులో కొన‌సాగుతున్న క‌రోనా విస్తృతి

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గత కొన్ని రోజులుగానైతే కొత్త కేసుల సంఖ్య మూడువేల‌కు త‌గ్గ‌డంలేదు. శ‌నివారం కూడా కొత్తగా 3,713 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,335కు చేరింది. అందులో 33,213 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మ‌రో 44,094 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌మిళ‌నాడులో వేగంగా పెరుగుతున్నాయి. శ‌నివారం ఒక్క‌రోజే కొత్త‌గా 68 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య వెయ్యి మార్కును దాటి 1,025కు చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్యశాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 


logo