గురువారం 09 జూలై 2020
National - May 05, 2020 , 17:20:45

పశ్చిమబెంగాల్‌లో తగ్గని కరోనా ఉధృతి

పశ్చిమబెంగాల్‌లో తగ్గని కరోనా ఉధృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 85 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బెంగాల్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1344కు చేరింది. మరోవైపు మరణాలు కూడా రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా మరో ఏడుగురు కరోనా బారినపడి మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 68కి పెరిగింది. ఇక మొత్తం కేసులలో నుంచి 68 మంది మృతులను, వైరస్‌ బారినుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన వారిని తీసివేయగా మరో 940 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పశ్చిమబెంగాల్‌ హోంశాఖ కార్యదర్శి అలపన్‌ బంధోపాధ్యాయ తెలిపారు.  logo