శుక్రవారం 29 మే 2020
National - Mar 28, 2020 , 08:36:12

దేశంలో 834 క‌రోనా కేసులు.. 19 కి చేరిన మృతులు

దేశంలో 834 క‌రోనా కేసులు.. 19 కి చేరిన మృతులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా (కొవిడ్‌-19) మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న‌ది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్త‌గా 110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 834కు చేరింది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా 19కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

కాగా, క‌రోనా వ్యాపి నివార‌ణ‌లో భాగంగా దేశ‌వ్య‌ప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం నాటికి 24 వేల మందికిపైగా క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 5 లక్షలు దాటింది. 


logo