సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 11:22:14

భార‌త్‌లో 39 మంది విదేశీయుల‌కు క‌రోనా

భార‌త్‌లో 39 మంది విదేశీయుల‌కు క‌రోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కేసుల సంఖ్యపరంగా పురోగమనమే త‌ప్ప‌ తిరోగమనం కనిపించడంలేదు. మన దేశంలోనూ కేసుల సంఖ్య 258కి చేరింది. నలుగురు మరణించారు. మొత్తం నమోదైన కేసుల్లో 219 మంది భారతీయులు కాగా, 39 మంది విదేశీయులు కూడా ఉన్నారు. వీరిలో 23 మంది ఇప్పటికే వైరస్‌ ప్రభావం నుంచి పూర్తిగా తేరుకుని తమ ఇండ్లకు చేరుకున్నారు. 

వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటిటికే వైరస్‌ ప్రభావం ఉన్న 22 రాష్ర్టాల్లో విద్యాసంస్థలు, బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. సాఫ్ట్‌వేర్‌ సహా పలు కార్పొరేట్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని పాటిస్తున్నాయి. దీంతో చాలావరకు జనం ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ సూచించారు.

 


logo