శుక్రవారం 29 మే 2020
National - Apr 10, 2020 , 13:10:20

హ‌ర్యానాలో 161కి క‌రోనా కేసులు

హ‌ర్యానాలో 161కి క‌రోనా కేసులు

చంఢీగ‌డ్‌: హ‌ర్యానాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరింది. గురువారం రాత్రి వ‌ర‌కు ఆ రాష్ట్రంలో156 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా.. శుక్ర‌వారం ఉద‌యం మ‌రో ఐదుగురికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 161కి చేరింది. కొత్త‌గా న‌మోదైన ఐదు కేసుల్లో ముగ్గురు అంబాలాకు చెందిన వారు కాగా, సోనిప‌ట్‌, పంచ్‌కులా ప్రాంతాల‌కు చెందిన వారు ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. 

అయితే, మొత్తం 161 కేసులకు గాను 18 మంది పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి కాగా, మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. మిగ‌తా 141 మంది ఇంకా ఐసోలేష‌న్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 3,496 మంది శాంపిళ్ల‌ను ప‌రీక్ష చేయ‌గా.. 2,443 మందికి క‌రోనా నెగెటివ్‌గా తేలింద‌ని హ‌ర్యానా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మ‌రో 892 మంది రిపోర్టులు రావాల్సి ఉంద‌ని చెప్పారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo