శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 13:06:11

మ‌హారాష్ట్ర‌లో 112కు పెరిగిన క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో 112కు పెరిగిన క‌రోనా కేసులు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య‌ వేగంగా పెరుగుతున్న‌ది. రోజురోజుకు ప‌దుల సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌హారాష్ట్ర స‌ర్కారు అన్నిర‌కాలుగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా మ‌హ‌మ్మారి మాత్రం విజృంభిస్తూనే ఉంది. తాజాగా మ‌రో ఐదు కొత్త కేసులు న‌మోద‌వ‌డంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 112కు చేరింది. 

తాజాగా సంగ్లి జిల్లా ఇస్లాంపూర్‌కు చెందిన ఓ కుటుంబంలో ఐదుగురికీ క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గ‌త 14 రోజులుగా వారు ఎక్క‌డెక్క‌డ ప్ర‌యాణించారు? విదేశాల‌కు ఏమైనా వెళ్లొచ్చారా? అనే వివ‌రాల‌ను అధికారులు రాబ‌డుతున్నారు. ఇదిలావుంటే మ‌హారాష్ట్ర‌లో సోమ‌వారం 8, మంగ‌ళ‌వారం 10 కొత్త కేసుల‌తోపాటు, బుధ‌వారం ఉద‌య‌మే 5 కేసులు న‌మోదవ‌డం ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది.   


logo