శనివారం 30 మే 2020
National - May 10, 2020 , 11:40:48

ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1980కి పెరిగాయి. 1010 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 925 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 45 మంది మరణించారు. గత 24 గంటల్లో 38 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 16 కేసులు, కర్నూలులో 13, నెల్లూరులో 5, ప్రకాశంలో 2, అనంతపురంలో 5, గుంటూరులో 6, కడప, విశాఖపట్నంలో ఒక్కో కేసు ఉన్నాయి.  

మొత్తంగా కర్నూలులో 566, గుంటూరులో 382, కృష్ణా జిల్లాలో 339, అనంతపురంలో 107, నెల్లూరులో 101, కడపలో 97,  పశ్చిమగోదావరిలో 68, ప్రకాశంలో 63, విశాఖపట్నంలో 63,తూర్పుగోదావరిలో 46, శ్రీకాకుళంలో 5,  విజయనగరం జిల్లాలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


logo