ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 12:57:28

ఒడిశాలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా

ఒడిశాలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా

భువనేశ్వర్‌ : ఒడిశాలో కరోనా వైరస్‌ నెమ్మదిగా రాష్ట్రమంతటా వ్యాపిస్తోంది. అక్కడ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,977 కొత్త కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 54,630కు చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఇవాళ 10 మంది వ్యాధి బారిన పడి మృతిచెందగా ఇప్పటివరకు 324కు మంది మృత్యువాత పడినట్లు తెలిసింది. 37,900 మంది రోగులు పూర్తిగా కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి కాగా 16,353 మంది ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్నారు. 

ఒడిశాలోని ఖోర్దా జిల్లాలో అత్యధికంగా 332 కరోనా కేసులు నమోదు కాగా గంజాంలో 280, మయూరభంజ్‌లో 120 కేసులు నమోదయ్యాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo