శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 13:07:55

దేశంలో 415కు చేరిన క‌రోనా కేసులు

దేశంలో 415కు చేరిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: క‌రోనా (కోవిడ్‌-19) కేసుల సంఖ్య‌ క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూనే ఉంది. ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌న దేశంలోనూ కోర‌లు చాస్తున్న‌ది. దేశ‌వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించినా, రాష్ట్రాల‌వారీగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్నా క‌రోనా మ‌హ‌మ్మారి మాత్రం క‌ట్ట‌డి కావ‌డంలేదు. కేసులు, మ‌ర‌ణాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నానికి 415 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 

ఇదిలావుంటే, అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 89 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. సోమ‌వారం ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇక‌ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు ఏడు క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించగా అందులో ముగ్గురు మ‌హారాష్ట్రకు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.  


logo