గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 11:44:11

దేశంలో 324కు కరోనా కేసులు

దేశంలో 324కు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మొత్తం 22 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 324కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 63 కేసులు నమోదయ్యాయి. కేరళ 45 కేసులతో రెండో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత యూపీలో 23, తెలంగాణలో 21 కేసులు నమోదయ్యాయి. 

కాగా, వైరస్‌ విస్తరణను అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ర్టాలు తగిన చర్యలు చేపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు రెండు వారాలపాటు జనం మధ్య తిరుగకుండా హోమ్‌ క్వారెంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నాయి. 60 ఏండ్లకు పైగా వయస్సున్న వృద్ధులు, చిన్నపిల్లలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉండటమే ఉత్తమమని సలహా ఇస్తున్నాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.     


logo