గురువారం 04 జూన్ 2020
National - Apr 02, 2020 , 08:44:46

రాజ‌స్థాన్‌లో మ‌రో 9 మందికి క‌రోనా.. 129కు చేరిన కేసులు

రాజ‌స్థాన్‌లో మ‌రో 9 మందికి క‌రోనా.. 129కు చేరిన కేసులు

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే అక్క‌డ 120 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. ఇప్పుడు మ‌రో 9 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాజ‌స్థాన్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 129కి చేరింది. ఈ మేర‌కు రాజ‌స్థాన్ వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కొత్త‌గా న‌మోదైన తొమ్మిది కేసుల్లో ఏడుగురు రామ్‌గంజ్‌కు చెందిన వారు కాగా.. జోధ్‌పూర్, ఝున్‌ఝును ప్రాంతాల‌కు చెందిన వారు ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు.  


logo