ఆ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి...

ఢిల్లీ :దేశంలో ఇప్పుడు కోవిడ్ తో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 4,55,555 కు చేరింది. అంటే, పాజిటివ్ గా నమోదైన మొత్తం సంఖ్యతో పోలిస్తే చికిత్సలో ఉన్నది 4.89 శాతం మాత్రమే. చికిత్సలో ఉన్నవారిలో గరిష్ఠంగా దాదాపు 70 శాతం మంది ఎనిమిది రాష్ట్రాలకు చెందినవారే. ఆ జాబితాలో మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 87,014 కోవిడ్ బాధితులు ఉండగా, రెండో స్థానంలో ఉన్న కేరళలో 64,615 మంది, ఢిల్లీలొ 38,734 మంది చికిత్సలో ఉన్నారు. గడిచిన 24 గంటలలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులలో వచ్చిన మార్పు దిగువ చిత్రంలో ఉంది. మహారాష్ట్రలో అదనంగా 1526 కేసులు రాగా చత్తీస్ గఢ్ లో చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 719 తగ్గింది. గడిచిన 24 గంటలలో 43,082 మందికి కొత్తగా కరోనా సోకింది. వీళ్లలో 76.93శాతం మంది పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. మహారాష్ట్రలో ఈ ఒక్క రోజులో అత్యధికంగా 6,406 కేసులు రాగా ఢిల్లీలో 5,475 మందికి, కేరళలో 5,378 మందికి కొత్తగా కరోనా సోకింది.
దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న మొత్తం కేసుల సంఖ్య 87 లక్షలు దాటి 87,18,517 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్న శాతం ఈ రోజుకు 93.65% కు చేరింది. గత 24 గంటలలో 39,379 మంది కోలుకోగా తాజాగా కోలుకున్నవారిలో 78.15శాతం పది రాష్ట్రాలనుంచే నమోదైంది. కేరళలో అత్యధికంగా ఒకరోజులో 5,970 మంది కోలుకోగా ఢిల్లీలో 4,937 మంది, మహారాష్ట్రలో 4,815 మంది కోలుకున్నారు.
తాజాగా గత 24 గంటలలో నమోదైన మరణాలలో 83.80శాతం పది రాష్ట్రాలకు చెందినవి కాగా, అవి మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. మహారాష్ట్రలో అత్యధికంగా 34.49శాతం మరణాలు నమోదు కాగా ఆ రాష్టంలో మొత్తం మరణాలు 46,813 కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 492 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వీరిలో 75.20శాతం మంది పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. 91 మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర (65), పశ్చిమ బెంగాల్ (52) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
తాజావార్తలు
- 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
- ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
- బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
- ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత