బుధవారం 03 జూన్ 2020
National - May 22, 2020 , 20:30:05

మహారాష్ట్రలో కరోనా విజృంభన.. ఒకేరోజు 2,940 కొత్త కేసులు

మహారాష్ట్రలో కరోనా విజృంభన.. ఒకేరోజు 2,940 కొత్త కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా వందల్లో కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ శుక్రవారం కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు 2,940 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 44,582కు చేరింది. 

కాగా, మహారాష్ట్రలో నమోదైన 2,940 కొత్త కేసులలో ఒక్క ముంబైలోనే 1751 కేసులు ఉన్నాయి. దీంతో ఆ నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 27,068కి చేరింది. కాగా, శుక్రవారం ఒక్కరోజే ముంబైలో 27 మంది మరణించారు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. ఇక ముంబైలోని మురికివాడ ధారవిలోనూ శుక్రవారం కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ధారవిలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 1478కి చేరుకున్నాయి. ధారవిలో మరణాలు కూడా 57కు చేరాయి.   


logo