సోమవారం 01 జూన్ 2020
National - May 17, 2020 , 21:12:14

తెలంగాణలో కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఆదివారం కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన వాటిలో 37 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.    దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా  కేసుల సంఖ్య 1,551కి  చేరింది. ఇవాళ ఒక్కరోజే 21 మంది కరోనా రోగులు డిశ్చార్జ్‌  అయ్యారు. ఇప్పటి వరకు 34 మంది కరోనా వల్ల చనిపోయారు. ప్రస్తుతం 525 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి వరకు 992 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 


logo