గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 09:51:44

దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 15,413 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,10,461కి చేరింది. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఒక్క రోజులోనే 306 మంది మరణించారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 13,254కి పెరిగింది. మొత్తం నమోదైన కేసుల్లో 1,69,451 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,27,756 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చడంతో దేశంలో గడిచిన ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు నమోదయ్యాయి.  

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,205 పాజిటివ్‌ కేసులు ఉండగా, 5,984 మంది బాధితులు మరణించారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 56,845కి చేరింది. రాష్ట్రంలో 704 మంది ఈ వైరస్‌ వల్ల మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 56,746 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 2,112 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 26,680 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 1638 మంది మరణించారు. అత్యధిక కేసుల జాబితాలో ఐదోస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 16594 కేసులు నమోదవగా, 507 మంది మరణించారు. 


logo