సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 21:23:22

తమిళనాడులో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

చెన్నై : తమిళనాడులో కరోనా  కేసులు 2లక్షలు దాటాయి. దీనికితోడు ప్రతీరోజు వేల కేసులు నమోదవుతున్నాయి. తాజా నివేదిక ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,988 కరోనా కేసులు నమోదుకాగా 89 మంది మరణించారు. 7,758 మంది చికిత్స పొంది కోలుకుని దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని మొత్తం సంఖ్య 2,06,737కి చేరింది. వీరిలో 52,273 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, 1,51,055 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

3,409మంది కరోనా బారిన పడి మృతి చెందారు.  ఇదిలా ఉంటే ఈ రోజు  64,315 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు మొత్తం  22,87,334 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo