శుక్రవారం 29 మే 2020
National - Apr 06, 2020 , 14:25:33

మ‌హారాష్ట్ర‌లో 781కి చేరిన క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో 781కి చేరిన క‌రోనా కేసులు

ముంబై: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విజృంభిస్తున్న‌ది. ఢిల్లీలోని మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో త‌బ్లిగీ జ‌మాత్ నిర్వ‌హించిన ప్రార్థ‌న‌లు క‌రోనా కేసుల సంఖ్య మ‌రింత పెరుగ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన వారిలో దేశ రాజ‌ధాని ఢిల్లీకి చెందిన వారు స‌హా అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉన్నారు. దీంతో వారి ద్వారా దేశ‌మంత‌టా క‌రోనా ర‌క్క‌సి విస్త‌రించింది. అయితే మ‌హారాష్ట్ర‌లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఆ రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 33 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మ‌హారాష్ట్ర‌లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 781కి చేరింది.  


logo