బుధవారం 27 మే 2020
National - May 18, 2020 , 11:45:13

ఢిల్లీలో పది వేలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీలో పది వేలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు పదివేలు దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 299 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,05కు పెరిగింది. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 4485 మంది బాధితులు కోలకున్నారు. మరో 5409 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 283 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్‌తో 160 మంది మరణించారు. 

దేశంలో కరోనా కేసులు 96169కి చేరాయి. ఇప్పటివరకు 1198 మంది మరణించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5242 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 157 మంది మృతిచెందారు.


logo