బుధవారం 03 జూన్ 2020
National - May 19, 2020 , 09:23:03

దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు

దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ స్వైరవిహారం చేస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4970 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 134 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 1,01,139కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల ఇప్పటివరకు 3163 మంది బాధితులు మరణించారు. దేశంలో ఇంకా 58,802 యాక్టివ్‌ కేసులు ఉండగా, 39,173 మంది బాధితులు కోలుకున్నారు. 

దేశంలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కరోనా ఉదృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 35,058 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1249 మంది మృతిచెందారు. తమిళనాడులో 11,760 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 81 మంది మరణించారు. మూడో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 11,745 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 694 మంది మరణించారు. దేశరాజధాని ఢిల్లీలో 10,054 మంది కరోనా బారినపడగా, 168 మంది బాధితులు మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లో 5,236 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇప్పటివరకు 252 మంది మరణించారు.


logo