శుక్రవారం 29 మే 2020
National - Apr 10, 2020 , 18:46:30

త‌మిళ‌నాడులో 900 దాటిన క‌రోనా కేసులు

త‌మిళ‌నాడులో 900 దాటిన క‌రోనా కేసులు

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ది. కొత్త‌గా మ‌రో 77 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు 834గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య సాయంత్రానికి 911కు చేరింది. దీంతో దేశంలో రాష్ట్రాల వారీగా న‌మోదైన కేసుల సంఖ్యప‌రంగా రెండో స్థానంలో ఉంది. మొద‌టి స్థానంలో కొన‌సాగుతున్న మ‌హారాష్ట్రలో ఇప్ప‌టివ‌ర‌కు 11,00కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కాగా, త‌మిళ‌నాడులో న‌మోదైన పాజిటివ్ కేసుల‌లో అత్య‌ధికంగా ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైనవారే ఉన్నార‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ చీఫ్ సెక్రెట‌రీ సీఎస్ ష‌ణ్ముగం వెల్ల‌డించారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo