గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 16:10:22

మ‌హారాష్ట్ర పోలీసుల‌లో 4,000 దాటిన కేసులు

మ‌హారాష్ట్ర పోలీసుల‌లో 4,000 దాటిన కేసులు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్ప‌టికే 1.20 ల‌క్ష‌లు దాటింది. ఇదిలావుంటే సాధార‌ణ జ‌నంలోనేగాక మ‌హారాష్ట్ర పోలీసుల‌లో సైతం క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అటు వైద్య‌, పారిశుద్ధ్య సిబ్బందిలోనూ చాలా మంది క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. 

ఇక శ‌నివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రానికి 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 88 మంది పోలీసులకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డ మ‌హారాష్ట్ర పోలీసుల సంఖ్య నాలుగు వేల మార్కును దాటి 4,048కి చేరింది. మొత్తం కేసులలో ప్ర‌స్తుతం 1,001 పాజిటివ్ కేసులు ఉండ‌గా మిగ‌తావారు వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్త‌గా మ‌రో పోలీస్ మృతిచెంద‌డంతో మొత్తం మృతుల సంఖ్య 47కు చేరింది.   


logo