శుక్రవారం 29 మే 2020
National - Mar 31, 2020 , 16:54:01

యూపీలో 100 దాటిన క‌రోనా కేసులు

యూపీలో 100 దాటిన క‌రోనా కేసులు

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతున్న‌ది. రాయ్‌బ‌రేలీలోని సుభాష్‌న‌గ‌ర్ ఏరియాలో మంగ‌ళ‌వారం ఒకే కుటుంబంలోని ఐదుగురికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో యూపీలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య  101కి చేరింది. వివ‌రాల్లోకి వెళ్తే రాయ్‌బ‌రేలీకి చెందిన ఓ యువ‌కుడు నోయిడాలో ప‌నిచేసేవాడు. ఇటీవ‌ల అత‌నికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్ అని వ‌చ్చింది. దీంతో అత‌ని కుటుంబంలోని మొత్తం ఆరుగురికి మంగ‌ళ‌వారం వైద్య‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

అయితే, మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో కుటుంబంలోని ఆరుగురిలో ఐదుగురికి క‌రోనా పాజిటివ్ అని తేలిన‌ట్లు రాయ్‌బ‌రేలీ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ వినీత్ శుక్లా తెలిపారు. యువ‌కుడి త‌ల్లి, తండ్రి, సోద‌రుడు, సోద‌రితోపాటు భార్య‌కు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌న్నారు. దీంతో సుభాష్‌న‌గ‌ర్ ప్రాంతాన్ని సీజ్ చేసి, వారి ఇంటిచుట్టూ 5 కిలోమీట‌ర్ల వ‌ర‌కు బ‌ఫ‌ర్ జోన్‌గా ప్ర‌క‌టించిన‌ట్లు చెప్పారు. అదేవిధంగా కిలోమీట‌ర్ ప‌రిధిలోప‌ల ఉన్న అన్ని కుటుంబాల‌కు క‌రోనా స్క్రీనింగ్‌ ప‌రీక్ష‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.  


  


logo