ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 02, 2020 , 20:07:32

ఢిల్లీలో 2500 దాటిన క‌రోనా కేసులు

ఢిల్లీలో 2500 దాటిన క‌రోనా కేసులు

న్యూ ఢిల్లీ :  దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ‌త కొన్నిరోజులుగా క‌రోనా కేసుల న‌మోదు త‌గ్గుముఖం ప‌ట్ట‌గా తాజాగా వాటి సంఖ్య మ‌ళ్లీ పెరుగుతోంది. వారం రోజుల నుంచి కేసుల సంఖ్య 2వేలు దాటుతోంది.

గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో 2,509 క‌రోనా కేసులు న‌మోదుకాగా.. 19 మంది వ్యాధి బారిన ప‌డి మ‌ర‌ణించార‌ని బుధ‌వారం వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. ‌దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,79,569కు చేర‌గా.. మ‌ర‌ణాల సంఖ్య 4,481కి చేరుకుంది. ఇవాళ 1,858 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇప్ప‌టివ‌ర‌కు 1,58,586 మంది రిక‌వ‌ర్ అయ్యారు. ప్ర‌స్తుతం 16,502 యాక్టీవ్ కేసులున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo