శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 18:41:39

తమిళనాడులో కరోనా అల్లకల్లోలం

తమిళనాడులో కరోనా అల్లకల్లోలం

చెన్నై : తమిళనాడులో ప్రమాదకర స్థాయిలో వైరస్‌వ్యాప్తి చెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో అక్కడ 85 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం 3,494మంది ఇప్పటివరకు కరోనాతో మరణించారు. ఇదేకాక రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో 6,986 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2,13,723కు చేరింది. ఇందులో 1,56,526 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. 53,703 మంది కరోనాతో దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo