సోమవారం 23 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 10:05:41

80 లక్షలకు చేరువలో కరోనా కేసులు

80 లక్షలకు చేరువలో కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం 40 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 43, 893 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 58,439 మంది కోలుకోగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 508 మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 79,90,322 కు చేరింది. వీరిలో 72,59,509 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 6,10,803 మంది చికిత్స పొందున్నారు.  ఇవాళ్టి వరకు లక్షా 20 వేల మంది చనిపోయారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.