National
- Jan 07, 2021 , 01:42:57
మురుగునీటిపై నిఘాతో..14 రోజుల ముందుగానే కరోనా అలర్ట్

న్యూఢిల్లీ, జనవరి 6: శుద్ధి చేయని మురుగునీటిపై నిఘాను కొనసాగిస్తే ఆయా ప్రాంతాల్లో కొవిడ్-19 ఉద్ధృతి ఎలా ఉండబోతున్నదో కనీసం రెండు వారాల ముందుగానే అంచనా వేయవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), గాంధీనగర్ శాస్త్రవేత్తలు తెలిపారు. మురుగునీటిలోని సార్స్-కోవ్-2 వైరస్ జెనెటిక్ లోడ్‌కు, కొవిడ్-19 కేసుల పెరుగుదలకు మధ్య సంబంధమున్నదని వెల్లడించారు. మురుగునీటిలో వైరస్ జెనెటిక్ లోడ్ ఎంత మోతాదులో ఉన్నదో తెలుసుకుంటే.. ఆ ప్రాంతంలో నమోదయ్యే కేసులపై 14 రోజుల ముందుగానే అంచనాకు రావొచ్చని పేర్కొన్నారు. వేస్ట్‌వాటర్ బేస్డ్ ఎపిడమాలజీ (డబ్ల్యూబీఈ)ని ఆధారంగా చేసుకొని అధికారులు కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు. వైరస్ హాట్స్పాట్లను సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు.
తాజావార్తలు
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఆదిపురుష్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్
- ఆయన సేవ.. మరొకరికి తోవ..
MOST READ
TRENDING