దేవాకట్టా-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘రిపబ్లిక్’. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో..అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే..ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం అంటూ సమకాలీన రాజకీయాలను ప్రశ్నిస్తూ సాగుతున్న టీజర్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది.
ఈ చిత్రంలో రమ్యకృష్ణ పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నట్టు టీజర్ చూస్తే తెలిసిపోతుంది. ఐశ్వర్యారాజేశ్ ఫీమేల్ లీడ్ చేస్తుండగా.. జగపతిబాబు కీ రోల్ పోషిస్తున్నాడు. జేబీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.