మంగళవారం 07 జూలై 2020
National - May 25, 2020 , 14:40:54

కర్ణాటకలో 1400 దాటిన యాక్టివ్‌ కేసులు

కర్ణాటకలో 1400 దాటిన యాక్టివ్‌ కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రోజురోజుకు కొత్త కేసుల నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తగా 69 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కర్ణాటకలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,158కి చేరింది. 

సోమవారం కొత్తగా మరో కరోనా బాధితుడు మృతిచెందడంతో కర్ణాటకలో మొత్తం మరణాల సంఖ్య 43కు చేరింది. అయితే వీరిలో ఇద్దరు కరోనా బాధితులు ఇతర కారణాలతో మరణించినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక కర్ణాటకలో నమోదైన మొత్తం కేసులలో ఇప్పటివరకు 680 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా 1433 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


logo