ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 07:34:23

ఆ ఎమ్మెల్యేల కోసం వెళ్లిన పోలీసుల‌కు మ‌ళ్లీ నిరాశే!

ఆ ఎమ్మెల్యేల కోసం వెళ్లిన పోలీసుల‌కు మ‌ళ్లీ నిరాశే!

న్యూఢిల్లీ: సీఎం అశోక్ గెహ్లాట్ స‌ర్కార్‌ను కూల్చ‌డానికి ప్ర‌య‌త్నించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కోసం వెళ్లిన రాజ‌స్థాన్ పోలీసుల‌కు మ‌ళ్లీ నిరాశే ఎదుర‌య్యింది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తిరుగుబాటు జెండా ఎగుర‌వేసిన స‌చిన్ పైల‌ట్ వ‌ర్గానికి చెందిన 18 ఎమ్మెల్యేల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందులో భాగంగా హ‌ర్యానాలోని మానెస‌ర్‌లో ఎమ్మెల్యేలు ఉంటుంన్న రిసార్టుకు ఆదివారం రాత్రి పోలీసులు మ‌రోమారు వెళ్లారు. అయితే వారిని రిసార్టు భ‌ద్ర‌తా సిబ్బంది లోనికి రానివ్వ‌లేదు. దీంతో 20 నిమిషాలపాటు గేటు వ‌ద్దే వేచిచూసిన పోలీసులు రిక్త‌హ‌స్తాల‌తో వెనుతిర‌గ‌క త‌ప్ప‌లేదు. 

స‌చిన్ పైల‌ట్ వ‌ర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై రాజ‌స్థాన్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్‌ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌న్వ‌ర్‌లాల్ శ‌ర్మ‌తో బీజేపీ నేత‌లు ఫోన్‌లో మాట్లాడిన‌ట్లు ఆడియో టేపులు వెలువ‌డ్డాయి. దీనికి సంబంధించి ఎమ్మెల్యే వాయిస్ రికార్డు కోసం గ‌త శుక్ర‌వారం వారుంటున్న ఐటీసీ భార‌త్ గ్రాండ్ రిసార్టుకు పోలీసులు వెళ్లారు. అయితే హ‌ర్యానా పోలీసులు వారికి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో రాజ‌స్థాన్ పోలీసులు వెనుతిరిగారు. 


logo