శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Aug 09, 2020 , 02:35:52

బిడ్డను చూడకుండానే..

బిడ్డను చూడకుండానే..

  • మరికొద్దిరోజుల్లో తండ్రి కానున్న కోపైలట్‌ అఖిలేశ్‌ శర్మ

న్యూఢిల్లీ: కోజికోడ్‌ విమాన ప్రమాదంలో మరణించిన కో పైలట్‌ అఖిలేశ్‌ శర్మ కుటుంబం గురించి గుండెను మెలిపెట్టే విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన భార్య మేఘన ప్రస్తుతం నిండు గర్భిణి. కొద్దిరోజుల్లో బిడ్డకు జన్మనివ్వనున్నది. ఇంతలోనే భర్తను కోల్పోయింది. ఇంతటి విషాదాన్ని కూడా కుటుంబసభ్యులు ఆమెకు తెలువకుండా జాగ్రపడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా భర్త మరణవార్తను చెప్పలేదని అఖిలేశ్‌ చిన్న తమ్ముడు లోకేశ్‌శర్మ తెలిపారు. అఖిలేశ్‌ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉంటున్నది. మహారాష్ట్రలోని సీఏఈ ఆక్స్‌ఫర్డ్‌ ఏవియేషన్‌ అకాడెమీలో పైలట్‌ శిక్షణ పొందిన అఖిలేశ్‌ 2017లో ఎయిర్‌ ఇండియాలో చేరారు.