మంగళవారం 02 జూన్ 2020
National - Apr 03, 2020 , 16:28:53

పోలీస్‌ అధికారిపై గ్రామస్థుల దాడి..

పోలీస్‌ అధికారిపై గ్రామస్థుల దాడి..

రాయ్‌గఢ్‌: లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన ఓ యువకుడిని హెచ్చరించిన పోలీస్‌ అధికారిపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కత్లీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..తపర్దా గ్రామానికి చెందిన నరేశ్‌ జంగ్డే అనే యువకుడు బైకుపై వస్తుంటే రోడ్డుపైకి రావొద్దని ఇంటికి వెళ్లాలని పెట్రోలింగ్‌లో ఉన్న హరీశ్‌ చంద్ర అనే పోలీస్‌ అధికారి సూచించారు. దీంతో నరేశ్‌ జంగ్డే పోలీస్‌ అధికారితో వాగ్విదానికి దిగాడు. ఆ తర్వాత నరేశ్‌ వాళ్ల ఇంటికి వెళ్లిపోయారు.

అయితే నరేశ్‌ జంగ్డే కొంత సేపటి తర్వాత తన సోదరుడితోపాటు కొంతమంది గ్రామస్థులను హరీశ్‌ చంద్ర దగ్గరకు తీసుకొచ్చాడు. గ్రామస్థులంతా కలిసి పోలీస్‌ అధికారి హరీశ్‌ చంద్రపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామానికి వచ్చి నరేశ్‌ జంగ్డేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo