శనివారం 23 జనవరి 2021
National - Jan 06, 2021 , 16:47:09

గుడ్లు, మాంసం బాగా ఉడ‌క‌బెట్టి తినండి!

గుడ్లు, మాంసం బాగా ఉడ‌క‌బెట్టి తినండి!

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుతం ఐదు రాష్ట్రాల‌ను వ‌ణికిస్తున్న బ‌ర్డ్ ఫ్లూ (ఏవియ‌న్ ఇన్‌ఫ్లుయెంజా)కు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదని అన్నారు కేంద్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌. గుడ్లు, మాంసాన్ని బాగా ఉడ‌క‌బెట్టుకొని తినండంటూ ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల‌కు అల‌ర్ట్‌గా ఉండాల‌ని ఆదేశాలు జారీ చేశామ‌ని, అన్ని విధాలుగా సాయం చేయ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. బ‌ర్డ్ ఫ్లూ ఎక్కువ‌గా ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో 12 ప్ర‌ధాన కేంద్రాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపారు. గ‌త ప‌ది రోజుల‌లో ఈ నాలుగు రాష్ట్రాల‌లో ల‌క్ష‌ల కొద్దీ కోళ్లు మృత్యువాత ప‌డుతున్నాయి. బ‌ర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరిగిపోతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. 


logo