మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 16:23:41

పెండ్లి కోసమే మతం మార్పిడి కుదరదు: కోర్టు

పెండ్లి కోసమే మతం మార్పిడి కుదరదు: కోర్టు

లక్నో: పెండ్లి కోసమే మతం మార్పిడి కుదరదని కోర్టు పేర్కొంది. ఒక జంట దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ముస్లిం మహిళ, హిందూ వ్యక్తితో పెండ్లికి నెల రోజుల ముందు హిందూమతంలోకి మారింది. తమకు పోలీస్‌ రక్షణ కల్పించాలంటూ ఈ జంట అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తి మహేష్ చంద్ర త్రిపాఠి ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. కేవలం వివాహం ప్రయోజనం కోసమే మత మార్పిడి ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. 2014లో ఇదే కోర్టు ఇచ్చిన ఒక తీర్పును ఆయన ప్రస్తావించారు. మత విలువలు, మత సంప్రదాయాలు గురించి తెలియకుండా, మతంపై నమ్మకం లేకుండా కేవలం వివాహం కోసమే మత మార్పిడి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈనేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం ఈ విషయంలో జోక్యం చేసుకోబోమంటూ ఆ జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.