సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 01:50:39

చావాలనుకునేవారిని ఎవరూ కాపాడలేరు

చావాలనుకునేవారిని ఎవరూ కాపాడలేరు

లక్నో: యూపీలో సీఏఏ నిరసనకారులపై పోలీసులు జరిపిన  కాల్పులను ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమర్థించారు. అసెంబ్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిరసనలు ప్రజాస్వామికంగా జరిగితే మద్దతు ఇస్తామని, హింసకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. ‘చావాలన్న ఉద్దేశంతో వచ్చేవాడు ఎలా బతుకుతాడు. ఒకడు ఓ అమాయకుడిని చంపాలని వస్తాడు.. అతడిని పోలీసు అడ్డుకుంటాడు. ఈ పరిస్థితుల్లో ఆ దుండగుడు లేదా పోలీసు మరణించాల్సిందే కదా?’ అని వ్యాఖ్యానించారు. పోలీసు కాల్పుల్లో ఒక్కరూ మరణించలేదని, నిరసనకారుల్లో వారికి వారే కాల్పులు జరుపుకొన్నారని చెప్పారు. యూపీలో గత డిసెంబర్‌లో జరిగిన కాల్పుల్లో 20 మంది మృతిచెందారు. 


logo