శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 21:45:56

పతంజలి ‘కరోనిల్’ ట్రేడ్‌మార్క్ పై వివాదం

 పతంజలి ‘కరోనిల్’ ట్రేడ్‌మార్క్ పై వివాదం

చెన్నై : ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబ పతంజలి సంస్థకు చెందిన   యుర్వేద ఔషధం "కరోనిల్ " కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. "కరోనిల్ " ట్రేడ్ మార్క్ కు సంబంధించి కొత్త సమస్య తలెత్తింది. ట్రేడ్ మార్క్  తమదంటూ చెన్నైకి చెందిన అరుద్రా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు హై కోర్టును ఆశ్రయించింది. ‘కరోనిల్’ 1993 నుంచి అరుద్రా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని ట్రేడ్‌మార్క్ అని పేర్కొన్నది. అందుకు సంబంధించిన ఆధారాలను ఆరుద్ర సంస్థ కోర్టుకు అందజేసింది.

కేసును విచారించిన జస్టిస్ సి.వి. కార్తికేయన్ పతంజలి సంస్థకు ట్రేడ్ మార్క్ ను వినియోగించవద్దని జూలై 30 వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ‘కరోనిల్’ 1993 నుంచి చెన్నైకి చెందిన అరుద్రా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలోనే ఉన్నదని పేర్కొన్నారు. అంతర్జాతీయ , దేశీయ మార్కెట్లలో 26 ఏండ్లుగా రసాయనాలు, శానిటైజర్ల తయారీ లో ఉన్నట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ట్రేడ్‌మార్క్‌తో తమ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందాయని   కంపెనీ అరుద్రా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొన్నది.


logo