బుధవారం 03 జూన్ 2020
National - May 18, 2020 , 21:29:40

అతివిశ్వాసంతోనే కరోనా సోకింది

 అతివిశ్వాసంతోనే కరోనా సోకింది

ముంబై: నాకేమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో కూడిన అతివిశ్వాసమే తనకు కరోనా వైరస్‌ సోకేలా చేసిందని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత జితేంద్ర అవాద్‌ వాపోయారు. అతి నమ్మకంతో కరోనా పాజిటివ్‌ వ్యక్తిని కలిశానని చెప్పారు. తన భద్రతా సిబ్బందికి కరోనా అని తేలడంతో గతనెల 13న క్వారంటైన్‌లోకి వెళ్లానని, ఆ తర్వాత దవాఖానలో చేరగా పాజిటివ్‌ అని తేలిందని చెప్పారు. ‘నేను బతికేందుకు తక్కువ అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. ప్రతిక్షణం చావు, బతుకు గురించే ఆలోచించా’ అని తెలిపారు. జీవితంలో మరింత క్రమశిక్షణ అవసరమని తెలుసుకున్నానని ఆయన చెప్పారు. జితేంద్ర అవాద్‌ ఈనెల 10న కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


logo