మంగళవారం 07 జూలై 2020
National - Jun 30, 2020 , 10:31:28

భార‌తీయ చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం : టిక్‌టాక్ ఇండియా

భార‌తీయ చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం :  టిక్‌టాక్ ఇండియా

హైద‌రాబాద్‌: టిక్‌టాక్‌తో స‌హా 59 చైనా యాప్స్‌పై భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ ఇండియా ఇవాళ‌ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.  డేటా ప్రైవ‌సీ, సెక్యూర్టీ విష‌యంలో భార‌తీయ చ‌ట్టాల‌కు లోబ‌డి ఉన్న‌ట్లు టిక్‌టాక్ ఇండియా పేర్కొన్న‌ది. భార‌తీయ యూజ‌ర్ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఇత‌ర విదేశీ ప్ర‌భుత్వాల‌తో షేర్ చేసుకోలేద‌ని చెప్పింది.  చైనా ప్ర‌భుత్వానికి కూడా త‌మ స‌మాచారాన్ని ఇవ్వ‌లేద‌న్న‌ది. ఒక‌వేళ ఎవ‌రైనా భ‌విష్య‌త్తులో స‌మాచారం కోరినా.. దాన్ని మేం వ్య‌తిరేకిస్తామ‌ని టిక్‌టాక్ తెలిపింది.  యూజ‌ర్ ప్రైవ‌సీ, స‌మాచారానికి అత్యున్న‌త ప్రాముఖ్య‌త‌ను ఇచ్చిన‌ట్లు టిక్‌టాక్ ఇండియా తెలిపింది. టిక్‌టాక్‌ను బ్లాక్ చేసిన నేప‌థ్యంలో ఆ అంశంపై భార‌త ప్ర‌భుత్వానికి క్లారిటీ ఇచ్చేందుకు ఆహ్వానం వ‌చ్చిన‌ట్లు కూడా ఆ సంస్థ పేర్కొన్న‌ది.

యాప్‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానం అందింద‌ని, వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం త‌మ‌ను కోరిన‌ట్లు టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.  టిక్‌టాక్ యాప్ ఇండియాలో 14 భాష‌ల్లో అందుబాటులో ఉన్న‌ది.  షార్ట్ వీడియో స‌ర్వీస్‌ను భార‌త్‌కు చెందిన ల‌క్ష‌లాది మంది వినియోగిస్తున్నారు.  టిక్‌టాక్‌, యూసీ బ్రౌజ‌ర్‌, వీచాట్, షేర్ ఇట్‌, కామ్‌స్కాన‌ర్ లాంటి చైనా యాప్స్‌ను భార‌త ప్ర‌భుత్వం నిషేధించింది. భార‌తీయ స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ‌తీసే విధంగా యాప్స్ ఉన్నాయ‌ని భార‌త్ ఆరోపించింది.  

ఈ వార్తలు కూడా చదవండి..


డిజిటల్‌ దెబ్బ అదిరింది!


చైనా సరిహద్దుల్లోకి భారత్‌ ఘాతక్‌ కమాండోలు
logo