బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 12:38:36

టైర్లు ఊడినా కూడా రోడ్డు మీద దూసుకెళ్తున్న లారీ కంటైన‌ర్!

టైర్లు ఊడినా కూడా రోడ్డు మీద దూసుకెళ్తున్న లారీ కంటైన‌ర్!

కంటైన‌ర్ ప‌క్క‌నుంచి వెళ్తుంటేనే మీద ప‌డినంత భ‌య‌మేస్తుంది. అలాంటిది రోడ్డు మీద ఉన్న‌వాటిని గుద్దుకుంటూ పోతుంటే.. అమ్మో ఇంకేమైనా ఉందా.. ఆ భ‌యానికే స‌గం చ‌చ్చిపోతాం. రాజ‌స్తాన్‌లోని నాగౌర్‌లో ఓ కంటైన‌ర్ లారీ బీభ‌త్సం సృష్టించింది. లారీలో మ‌ద్యం ర‌వాణా జ‌రుగుతుంద‌ని పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో ఆ కంటైన‌ర్‌ను ఆపే ప్ర‌య‌త్నం చేశారు. డ్రైవ‌ర్ ఆప‌కుండా వేగంగా వెళ్తున్న‌ది. 100 కి.మీ. పాటు ఆరు పోలీస్ స్టేష‌న్ పోలీసుల‌ను రోడ్డు మీద ప‌రుగులు పెట్టించింది. లారీని ఆపేందుకు పోలీసులు రోడ్డు మీద 12 భారీకేడ్లు కూడా పెట్టి చూశారు. అయినా ఫ‌లితం లేక‌పోయింది.

డ్రైవ‌ర్ వేగానికి లారీ టైర్లు కొన్ని ఊడిపోతే మ‌రికొన్ని పేలిపోయాయి. టైర్లు లేక‌పోయినా వాహనం వేగం మాత్రం త‌గ్గ‌లేదు. చివ‌రికి ఓ సిమెంట్ ఇటుక‌లు త‌యారు చేసే బ‌ట్టీలోకి కంటైన‌ర్ దూసుకెళ్లింది. అప్పుడు గాని లారీ ఆగ‌లేదు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మ‌రి ఇంత ప్ర‌య‌త్నం చేసి ఆపిన కంటైన‌ర్‌లో మ‌ద్యం బాటిళ్లు ఉన్నాయో లేవో కాని ఈ సంఘ‌ట‌న మాత్రం వైర‌ల్ అయింది. 

 


logo