సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 11:35:07

అయోధ్యలో త్వరలో ప్రారంభం కానున్న రామ మందిర నిర్మాణ పనులు

అయోధ్యలో త్వరలో ప్రారంభం కానున్న రామ మందిర నిర్మాణ పనులు

న్యూ ఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీ రామ్‌జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు అయోధ్యలో శనివారం సమావేశమై ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించిన తేదీని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని కూడా ఆహ్వానించగా, ఆయన హాజరై ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించే తేదిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 

ఈ సమావేశంలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా హాజరుకానున్నారు. దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరుకానున్నారు. రామ్‌జన్మ భూమి వద్ద ఆలయ నిర్మాణ పనులు ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ, భగవత్, యుపీ సీఎంతో పాటు కొద్ది మంది మంత్రులు మాత్రమే పాల్గొననున్నారు. 

ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి గర్భ్ గ్రిహ వద్ద భూమి పూజ జరుగనుంది. ఆలయ నిర్మాణం కోసం ఇది అధికారిక కార్యక్రమం అని, దీనికోసం ఆహ్వానాలు కూడా పంపబడ్డాయి అని’’ ట్రస్టు సభ్యులు తెలియజేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo