ఆదివారం 05 జూలై 2020
National - Jun 19, 2020 , 13:33:41

గుడి క‌న్నా దేశమే ముఖ్యం.. అయోధ్య ఆల‌య ప‌నులు నిలిపివేత‌

గుడి క‌న్నా దేశమే ముఖ్యం.. అయోధ్య ఆల‌య ప‌నులు నిలిపివేత‌

హైద‌రాబాద్‌: చైనాతో ల‌డ‌ఖ్ విష‌యంలో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో.. అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం ప‌నుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు రామ‌మందిర ట్ర‌స్టు పేర్కొన్న‌ది. చైనాతో స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌రిస్థితి భీక‌రంగా ఉంద‌ని, ఇప్పుడు దేశాన్ని ర‌క్షించుకోవ‌డ‌మే ముఖ్య‌మ‌ని రామ‌మందిర ట్ర‌స్టు పేర్కొన్న‌ది. గాల్వ‌న్ లోయ‌లో భార‌త‌, చైనా బ‌ల‌గాలు హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌కు దిగిన విష‌యం తెలిసిందే.  ఆ గొడ‌వ‌లో భార‌త సైన్యానికి చెందిన 20 మంది సైనికులు అమ‌రుల‌య్యారు. 

సుప్రీంకోర్టు ఇచ్చిన చ‌రిత్రాత్మ‌క తీర్పును ఆధారంగా చేసుకుని.. రామ‌మందిర ట్ర‌స్టు అయోధ్య‌లో ఆల‌య నిర్మాణ ప‌నుల‌కు శ్రీకారం చుట్టాల‌నుకున్న‌ది. ఇప్ప‌టికే కొన్ని పూజ‌లు జ‌రిగాయి.  ఇటీవ‌లే అక్కడ శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ప్ర‌ధాని మోదీ చేతుల‌గా మీదుగా అధికారిక ప‌నులు ప్రారంభం కావాల్సి ఉన్న‌ది. కానీ ఆ ముహూర్తాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు ట్ర‌స్టు చెప్పింది.

దేశంలో ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన త‌ర్వాత‌.. రామాల‌య నిర్మాణ ప‌నుల గురించి కొత్త తేదీని వెల్ల‌డించ‌నున్న‌ట్లు ట్ర‌స్టు స‌భ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.  గాల్వ‌న్ లోయ‌లో అమ‌రులైన భార‌త జ‌వాన్ల‌కు ట్ర‌స్టు నివాళి అర్పించింది. 



logo